మూడుసార్లు టెండర్లు పిలిచినా..
భూదాన్‌పోచంపల్లి : ప్రమాదకరంగా మారిన భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పురం చెరువు కట్ట మూలమలుపు సమీపంలో భద్రతా చర్యలు చేపట్టేందుకు నిధులు మంజూరైనా పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. నిధులు మంజూరై మూడు నెలలు గడుస్తున్నా పనులు మాత్రం టెండర్ల దశలోనే ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ 7న జలాల్‌పురం చెరువు కట్ట మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌కు చెందిన ఐదుగురు యువకులు జల సమాధి అయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన మరువకముందే మరో వారం రోజుల్లో ఇంకో కారు చెరువులో పడిపోయింది. ఇలా గడిచిన నాలుగైదు సంవత్సరాల్లో చెరువు కట్ట మూలమలుపు వద్ద పదుల కొద్ది ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం, ఆస్థినష్టం వాటిల్లింది.
పనులు నిల్..
చెరువు కట్ట మూలమలుపు వద్ద వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రదేశంలో భద్రతా చర్యల కోసం స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి రూ.20 లక్షలు మంజూరు చేయించారు. డిసెంబర్ 31న ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి చెరువు కట్టను ఎమ్మెల్యే సందర్శించి కట్ట మూలమలుపు వద్ద తీసుకోవాల్సి న రక్షణ చర్యలను పరిశీలించారు. స్థానికుల ధర్నాలు, ఆందోళనలతోపాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కానీ నిధులు మంజూరై మూడు నెలలు గడుస్తున్నా పనుల్లో పురోగతి లేదు.
టెండర్లు పిలిచినా..
చెరువు కట్ట వద్ద భద్రతా చర్యల్లో భాగంగా మంజూరైన రూ.20 లక్షల నిధులతో చెరువు కట్టకు ఇరువైపులా 400 మీటర్ల మెటల్ బారికేడ్లు, మూలమలుపుల వద్ద మెయిన్ రోడ్డుపై రంబుల్ స్టిప్స్, రోడ్స్ స్టంట్, కాషన్ బోర్డులు, బ్లింకింగ్ లైట్లు ఏర్పాటు చేయడానికి అధికారులు టెండర్లు పిలిచారు. ఇప్పటికీ మూడుమార్లు టెండర్లు పిలిచినా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాకపోవడం, తాజాగా పనులు చేస్తే బిల్లులు వస్తాయో, రావో అనే అనుమానంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది.
ముందుకు రాని కాంట్రాక్టర్లు
ఫ ప్రమాదకరంగా జలాల్‌పురం
చెరువు కట్ట వద్ద మూలమలుపు
ఫ భద్రతా చర్యలకు నిధులు మంజూరు
ఫ ప్రారంభం కాని పనులు
ఫ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు
జలాల్‌పురం చెరువు కట్ట మూలమలుపు వద్ద భద్రతా చర్యల నిమిత్తం ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి రూ. 20 లక్షలు మంజూరయ్యాయి. గత నెలలో టెండర్లు పిలిచాం. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇప్పటికీ మూడుమార్లు టెండర్లు పిలిచినా ఫలితం లేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టేలా కృషి చేస్తున్నాం.
– లింగయ్య, ఆర్‌అండ్‌బీ ఏఈ, భూదాన్‌పోచంపల్లి
తాత్కాలిక చర్యలతోనే సరి..
చెరువు కట్ట మూలమలుపు వద్ద ప్రమాదాల నివారణకు గత నెలలో రాచకొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తాత్కాలికంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించేలా కట్టకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని చెరువు కట్ట మూలమలుపు వద్ద భద్రతా చర్యలు త్వరగా చేపట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
మూడుసార్లు టెండర్లు పిలిచినా..
మూడుసార్లు టెండర్లు పిలిచినా..
Comments
Please login to add a commentAdd a comment