పనులు పూర్తయ్యేదెలా!
యాదగిరీశా..
సాక్షి, యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పెండింగ్ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మూడు మూడు రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఇస్తామన్న నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆలయ ఉద్ఘాటన జరిగి రెండు సంవత్సరాలు కావొస్తున్నా గుట్ట పనులకు నిధుల కొరత వేధిస్తోంది. పెండింగ్ బిల్లులు విడుదల చేస్తే తప్ప.. ప్రస్తుతం చేపట్టిన పనులు ముందుకు సాగేలా లేవు.
సీఎంఓలో ప్రతిపాదనలు పెండింగ్
గత సంవత్సరం నవంబర్ 8న సీఎం రేవంత్‌రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్టకు వచ్చారు. ఆ సమయంలో ఆలయ అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొండ ప్రాశస్త్యం, భక్తులకు వసతుల కోసం అధికారులు నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపారు. భక్తులు రాత్రి కొండపైన నిద్ర చేయడానికి డార్మెటరీ హాల్, కల్యాణ మండపం, కళాభవన్, క్యూ లైన్లలో మరిన్ని వసతుల కల్పనకు రూపొందించిన ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు చేసిన పనులకు బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.
నిలిచిపోయిన ఘాట్ రోడ్డు పనులు
వైశ్య సత్రం నుంచి తులసీ వనం మీదుగా కొండపైకి చేపట్టిన ఘాట్‌రోడ్డు పనులు నిలిచిపోయాయి. యాదగిరిగుట్ట–తుర్కపల్లి రోడ్డుపై బ్రిడ్జి కోసం చేపట్టిన కేబుల్ వంతెన పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఒకే రోడ్డు ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
ప్రారంభం కాని సంగీత్ భవన్ పనులు
కొండపైన బాలాలయం తొలగించిన స్థానంలో నిర్మిస్తామన్న సంగీత్ భవన్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఆధ్యాత్మిక, ధార్మిక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
వ్యాపార సముదాయాల
కేటాయింపుల్లో జాప్యం
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో వ్యాపార సముదాయాల కోసం నిర్మించిన కాంప్లెక్స్‌లో కొన్ని మడిగెలను వ్యాపారులకు కేటాయించారు. మరికొన్ని కేటాయించాల్సి ఉంది. 162 దేవస్థానం దుకాణాలు, 166 ఓనర్ షిప్ దుకాణాల నిర్మాణం పూర్తయ్యింది. కొన్ని కేటాయింపుల్లో జాప్యం జరుగుతోంది.
దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ సత్రం
రూ.11 కోట్ల దాతల నిధులతో చేపట్టిన అన్నప్రసాద వితరణ సత్రం పనులు పూర్తయ్యాయి. తాత్కాలికంగా దీక్షాపరుల మండపంలో ప్రతిరోజూ భక్తులకు అన్నప్రసాదం చేస్తున్నారు. నూతన భవనం పనులు 59 వేల చదరపు అడుగుల్లో నిర్మించారు. ఇందులో ఫర్నిచర్, వంట సామగ్రి వసతులు పెండింగ్‌లో ఉన్నాయి. అన్నప్రసాద సత్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రతిరోజూ 2000 మందికి అన్నప్రసాద వితరణ చేయవచ్చు.
రెండేళ్లుగా నిలిచిపోయిన నిధులు
సీఎం పేషీలో కొత్త ప్రతిపాదనలు
పెండింగ్‌లో బస్టాండ్ నిర్మాణం
బ్రహ్మోత్సవాల నాటికి
పూర్తి కావడం కష్టమే!
పనులు పూర్తయ్యేదెలా!
Comments
Please login to add a commentAdd a comment