పకడ్బందీగా పోలింగ్
ఫ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం
ఫ విధులకు రెండు వేల మంది సిబ్బంది
ఫ దూర ప్రాంతాల నుంచి బ్యాలెట్ బాక్సులు
భద్రంగా తెచ్చేలా కార్యాచరణ
ఫ వాహనాలకు నల్లగొండ జిల్లా పోలీసుల భద్రత
ఫ ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు
హక్కు వినియోగించుకోండి
ఫ ఉపాధ్యాయ ఓటర్లకు రిటర్నింగ్
అధికారి ఇలా త్రిపాఠి సూచన
సాక్షి ప్రతినిధి, నల్లగొండ :
వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రెండు వేల మంది సిబ్బందితో ఎన్నికలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఉపాధ్యాయులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లు ఉండగా.. 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. దాదాపు 1100 మందిని ఎన్నికల నిర్వహణ కోసం కేవలం పోలింగ్ కేంద్రాల్లోనే ఏర్పాటు చేశాం. దాదాపు వేయి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు బస్సుల్లో వెళ్లేటప్పటి నుంచి తిరిగి రిసెప్షన్ సెంటర్‌కు వచ్చే వరకు పోలీసుల భద్రత ఉంటుంది. వాహనం వెంట సెక్యూరిటీ కూడా నల్లగొండ జిల్లా పోలీసులే ఉంటారు.
ఆర్జాలబావి గోదాం వద్ద
రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూం
నల్లగొండ పట్టణ సమీపంలోని ఆర్జాలబావి వేర్‌హౌజింగ్ గోదాముల్లో రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశాం. అక్కడి నుంచే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను పంపుతాం. 26వ తేదీన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామగ్రి తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అనంతరం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు సంబంధించిన అన్ని బ్యాలెట్ బాక్సులను నల్లగొండలోని రిసెప్షన్ సెంటర్‌కు తీసుకొస్తాం. అక్కడే ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో భద్రపరుస్తాం. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది.
ప్రలోభాలకు గురికావద్దు..
ఉపాధ్యాయులు ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మనకు ప్రజాస్వామ్య బద్దంగా ఎవరైతే సేవ చేస్తారో అలాంటి సమర్థులైన, సేవా భావం కలిగిన వారిని ఎన్నుకోవాలి.
27న ప్రత్యేక సెలవు..
పోలింగ్ సమయం వరకు ఉండాల్సిందే..
కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 6 నుంచి 9 మంది వరకే ఓటర్లున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో కనిష్టంగా ఆరుగురు ఓటర్లున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఒకటో పోలింగ్ స్టేషన్ ఉండగా నల్లగొండ జిల్లా గుడిపల్లిలో చివరి పోలింగ్ స్టేషన్ ఉంది. తక్కువ మంది ఓటర్లు ఉన్న కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం వరకే వంద శాతం పోలింగ్ పూర్తయినా సాయంత్రం 4 గంటల వరకు సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లోనే ఉండాలి.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన వారికి ఈ నెల 27న పోలింగ్ సందర్భంగా ప్రత్యేక సెలవు ఇస్తున్నాం. దాంతో పోలింగ్ స్టేషన్లు ఉన్న కళాశాలలు, పాఠశాలలు, కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించాం.
పకడ్బందీగా పోలింగ్
Comments
Please login to add a commentAdd a comment