మౌలిక వసతులు కల్పించండి
భువనగిరిటౌన్ : రంజాన్ మాసం ప్రారంభం అవుతున్నందున ఈద్గాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసం పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో శాంతి సంఘం సమావేశం కలెక్టరు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సంబంధిత శాఖల అధికారులకు కేటాయించిన విధులను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. నమాజ్ వేళల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ రంజాన్ మాసంలో మసీదుల వద్ద పటిష్ట బందోబస్తు ఉంటుందని, సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్. ఏసీపీ రాహుల్‌రెడ్డి, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, మత పెద్దలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత శిఖరాలను
అధిరోహించాలి
భువనగిరి : విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయిని అధిరోహించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. 10వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు మంగళవారం భువనగిరి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ప్రేరణ అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడుతూ రాబోయే 23 రోజులు ప్రణాళిక ప్రకారం చదివి 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి సైకిల్ బహుమతిగా ఇచ్చి తల్లిదండ్రులను జిల్లా అధికారుల సమక్షంలో సన్మానిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్, డీఈఓ సత్యనారాయణ, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ జిల్లా ఽఅధికారి యాదయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వసంతకుమారి, జేఏసీ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, ఏఎస్‌డబ్ల్యూఓ తారాబాయి, ఇమాన్యూయేల్, శైలజ, ఆనంద్, విజయశాంతి, రమాదేవి, సునిల్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్‌ల పరిశీలన
వలిగొండ : ఈ నెల 27న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వలిగొండ శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లను కలెక్టర్ హనుమంతరావు మంగళవారం పరిశీలించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రికార్డులను పరిశీలించి రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సుచించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment