
చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్
నల్లగొండ: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితులను బుధవారం నార్కట్‌పల్లిలో అరెస్ట్ చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. నార్కట్‌పల్లిలో నల్లగొండ ఎక్స్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చిట్యాల వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులపై అనుమానం రావడంతో వారిని పోలీసులు ఆపి విచారించగా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు నిజం ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమల్ల రఘు ప్రస్తుతం నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో ఉంటున్నాడని, మరొకరు మైనర్ అని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 1.5 తులాల బంగారు నల్లపూసల గొలుసు, బైక్‌ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామన్నారు. నిందితులను పట్టుకున్న సీసీఎస్ సీఐ సోమ నర్సయ్య, నార్కట్‌పల్లి సీఐ కె. నాగరాజు, నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్, సీసీఎస్ ఏఎస్‌ఐ యాదగిరిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్, గిరి, రాంప్రసాద్, వాహిద్, అఖిల్, సాయికుమార్, హరిప్రసాద్‌ను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించారు.
చికిత్స పొందుతూ
గుర్తుతెలియని వ్యక్తి మృతి
సూర్యాపేటటౌన్: గుర్తుతెలియని వాహనం ఢీకొని గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజుగారి రుచులు హోటల్ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ నెల 13వ తేదనీ గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, మృతుడి వివరాలు తెలిసిన వారు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో లేదా 8712686005 నంబర్‌ను సంప్రదించాలని సీఐ వీరరాఘవులు తెలిపారు.
నకిలీ సర్టిఫికెట్ల కేసులో
మిర్యాలగూడ వాసి అరెస్ట్
ఫ రిమాండ్‌కు తరలించిన గద్వాల పోలీసులు
మిర్యాలగూడ అర్బన్: నకిలీ సర్టిఫికెట్ల కేసులో మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన మాజీ ప్రిన్సిపాల్ బాలకృష్ణను గద్వాల పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గద్వాలకు చెందిన వ్యక్తి అగ్రికల్చర్ చదవకుండా చదివినట్లు నకిలీ సర్టిఫికెట్లు చూపించి వ్యవసాయ శాఖలో ఉద్యోగం పొందగా.. అతడితో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని గతంలోనే పోలీసులను అరెస్టు చేయగా.. వారికి నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించిన బాలకృష్ణను కూడా బుధవారం మిర్యాలగూడ నుంచి తీసుకెళ్లిన గద్వాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై గద్వాల పోలీసులు బాలకృష్ణను పోలీస్ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేనున్నట్లు తెలిసింది.
శివాలయంలో బయల్పడిన శివలింగం, వెండి కన్ను
చండూరు: చండూరు మండలం చామలపల్లిలో గల పురాతన శివాలయం పునర్నిర్మాణంలో భాగంగా బుధవారం గ్రామస్తులు పనులు చేస్తుండగా శివలింగంతో పాటు వెండి కన్ను బయల్పడ్డాయి. దీంతో గ్రామస్తులు ప్రముఖ చరిత్రకారుడు ఎస్. లింగమూర్తికి సమాచారం అందించగా.. ఆయన వచ్చి పురాతన శివాలయాన్ని పరిశీలించారు. 9వ శతాబ్దం ప్రారంభంలో దేవాలయం నిర్మించారని, ఆనాడు మత ఘర్షణల కారణంగా గర్భగుడిలోని విగ్రహాలపై కప్పును తీసి వేశారని లింగమూర్తి వివరించారు. అప్పటి వస్తువులే ఇప్పుడు లభించాయన్నారు.

చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment