
పాముకాటుతో గీత కార్మికుడు మృతి
నార్కట్‌పల్లి: పాముకాటుతో గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం తొండల్‌వాయి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండల్‌వాయి గ్రామానికి చెందిన గీత కార్మికుడు దంతూరి ఽశంకర్(30) బుధవారం సాయంత్రం గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా పాము కాటు వేసింది. వెటనే చెట్టు పైనుంచి కిందకు దిగిన శంకర్ తోటి గీత కార్మికుడికి విషయం తెలియజేసి స్పృహతప్పి పడిపోయాడు. గ్రామస్తుల సహకారంతో కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment