
మేళ్లచెర్వులో వైభవంగా మహాశివరాత్రి జాతర
మేళ్లచెరువు: మండల కేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలను రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి దంపతులు బుధవారం తెల్లవారుజామున ప్రారంభించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూలమాల, శాలవాలతో ఘనంగా సత్కరించారు. కల్యాణ మహోత్సవంలో భాగంగా ఆలయంలో సుప్రభాతం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, ఔపాసన, బలిహరణ, రాత్రి లింగోద్భావకాల మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, విశేష పుష్పాలంకరణ, మహనివేదన, తీర్ధప్రసాద వినియోగం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఆలయ కమిటీ సభ్యులు చర్యలు తీసుకున్నారు. క్యూలైన్లలో భక్తులకు తాగునీరు అందించడంతో పాటు అన్నదానం చేశారు. వారి వెంట కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనెపల్లి చందర్‌రావు, కృషి ఫౌండేషన్ చైర్మన్ పోశం నర్సిరెడ్డి, నాయకులు భాస్కరరెడ్డి, సైదేశ్వరరావు, గోవిందరెడ్డి, రామకృష్ణారెడ్డి, దేవాలయ చైర్మన్ శంభిరెడ్డి, పాలకవర్గం సభ్యులు ఉన్నారు.
ఎద్దుల పందేలు ప్రారంభం
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వద్ద జాతీయ స్థాయి ఎద్దుల పందేలు నిర్వహించారు. పాలపండ్ల విభాగం ఎద్దుల పోటీలను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ప్రారంభించారు. కార్యక్రమంలో ఐరా రియాల్టీ చైర్మన్ పోశం నర్సిరెడ్డి, దేవాలయ చైర్మన్ శాగంరెడ్డి శంభిరెడ్డి పాల్గొన్నారు.
ఫ ప్రారంభించిన మంత్రి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు

మేళ్లచెర్వులో వైభవంగా మహాశివరాత్రి జాతర
Comments
Please login to add a commentAdd a comment