
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
ఆలేరు రూరల్: ఆలేరు మండలం టంగుటూరు గ్రామ శివారులో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండాకు చెందిన బానోతు వెంకన్న(24) ఆలేరు మండలం టుంగుటూరు గ్రామ శివారులో తుమ్మ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం టంగుటూరు గ్రామానికి చెందిన వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న బైక్ నంబర్ ఆధారంగా మృతుడు వెంకన్నగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంకన్న ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రజనీకాంత్ తెలిపారు.
కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు
చివ్వెంల(సూర్యాపేట): అతివేగంగా వస్తున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టిఅదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామ శివారులో హైదరాబాద్–విజయవాడ హైవేపై బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన షేక్ మక్సూద్, షేక్ రసూల్, షేక్ రఫీక్ కారులో విజయవాడకు వెళ్తుండగా.. మార్గమధ్యలో చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామ శివారులో హైవేపై చెట్లకు నీరు పోస్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా యూటర్న్ వద్ద అడ్డురావడంతో దానిని కారు ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు సూర్యాపేటకు తరలించారు. అతివేగమే ప్రమదానికి కారణమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment