
వరంగల్‌లో నల్లగొండ విద్యార్థిని ఆత్మహత్య
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని వరంగల్ జిల్లా అరేపల్లి సమీపంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆవరణలోని వరంగల్ వ్యవసాయ కళాశాలలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ పట్టణానికి చెందిన గుంటోజు సత్యనారాయణ, రమ్య దంపతులు రాక్‌హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. సత్యనారాయణ పెద్దకాపర్తిలో బ్రాంచి పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. మూడవ సంతానం రేష్మిత(19)కు ఇటీవల వరంగల్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీలో సీటు వచ్చింది. నెల రోజుల క్రితం అడ్మిషన్ తీసుకుని హాస్టల్ ఉంటోంది. హాస్టల్‌లో చేరినప్పటి నుంచి చదువుతో ఒత్తిడికి గురవుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెబుతోంది. దీంతో ఇటీవల ఇంటికి తీసుకొచ్చి నచ్చజెప్పి మళ్లీ వరంగల్ కాలేజీకి పంపించారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో రేష్మిత ఫోన్‌లో మాట్లాడింది. మంగళవారం హాస్టల్ గదిలో రేష్మిత్ మాత్రమే ఉంది. బుధవారం ఉదయం రేష్మిత ఉన్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా.. రేష్మిత గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇంటి నుంచి వెళ్లిన వారంలోనే కుమార్తె హఠాన్మరణం చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నల్లగొండకు తరలించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హాస్టల్ సిబ్బంది, మేనేజ్‌మెంట్ పర్యవేక్షణ లోపం వల్లే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి సత్యనారాయణ ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫ బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న రేష్మిత
ఫ నల్లగొండలోని రాక్‌హిల్స్ కాలనీలో విషాదఛాయలు
Comments
Please login to add a commentAdd a comment