
మహాశివుడికి శత రుద్రాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు బుధవారం నాల్గో రోజుకు చేరుకున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని గర్భాలయంలోని మహాశివుడికి, ముఖ మండపంలోని స్పటిక లింగానికి అభిషేకాలు జరిపించారు. రాత్రి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిపించారు. మంగళవారం రాత్రి స్వామివారి కల్యాణ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం నిత్య హవనములు, శివ పంచాక్షరీ జపములు, నందీశ్వర పారాయణములు, పంచసూక్త పఠనములు, మూలమంత్ర జపములు, వివిధ పారాయణములు గావించారు. రాత్రి స్వామికి మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం నిర్వహించారు. ఆయా పూజల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. శివాలయంలో గురువారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లక్ష బిల్వార్చన జరిపిస్తారు. రాత్రి ఆలయ మాడ వీధిలో శ్రీరామలింగేశ్వరస్వామి రథోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఫ యాదగిరిగుట్టలో కొనసాగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment