నార్కట్‌పల్లి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు దేవాలయంలో శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామివార్లకు అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సురేశ్‌శర్మ, సతీష్‌శర్మ, శ్రీక్రాంత్ శర్మ, శశిశర్మ ఆధ్వర్యంలో ఏకాదశ రుద్రాభిషేక, సహస్ర నామార్చనలు, హోమం, అభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు. శివరాత్రి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మార్మోగాయి. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెర్వుగట్టు ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment