నేడే టీచర్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడే టీచర్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌

Published Thu, Feb 27 2025 1:42 AM | Last Updated on Thu, Feb 27 2025 1:41 AM

నేడే

నేడే టీచర్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి యాదాద్రి : వరంగల్‌–ఖమ్మం–నలగొండ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి నల్ల గొండ జిల్లా పరిధిలో 77 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. 4 గంటల్లోపు పోలింగ్‌ కేంద్రం గేటు లోపల ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతిస్తారు. నాలుగు గంటల తరువాత వచ్చే వారిని అనుమతించరు. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది పోటీలో ఉన్నారు.

పోలింగ్‌ కేంద్రాలకు చేరిన సిబ్బంది

నల్లగొండలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం నుంచి పోలింగ్‌ సామగ్రి, బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లను రెండు రోజులు ముందుగానే అధికారులు ఆయా జిల్లాలకు తీసుకెళ్లారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి బుధవారం పోలింగ్‌ బ్యాలెట్‌ బాక్సులతోపాటు బ్యాలెట్‌ పేపర్లు, పోలింగ్‌ సామగ్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో పోలీసుల భద్రత నడుమ పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు.

హన్మకొండలో అత్యధిక ఓటర్లు

నియోజకవర్గవ్యాప్తంగా చూస్తే హన్మకొండ జిల్లాలో అత్యధిక ఓటర్లు (5215 మంది) ఉన్నారు. ఆ తరువాత స్థానంలో నల్లగొండ జిల్లాలో 4,683 మంది ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో 2664 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 984 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు.

బాక్సులన్నీ నల్లగొండకే..

పోలింగ్‌ ముగిసిన తరువాత బ్యాలెట్‌ బాక్సులన్నీ నల్లగొండలోని ఆర్జాలబావి రిసెప్షన్‌ సెంటర్‌కు తరలించనున్నారు. 27వ తేదీన రాత్రి 8 గంటల నుంచి పోలింగ్‌ బాక్సులు రిసెప్షన్‌ సెంటర్‌కు చేరుకుంటాయి. మరుసటి రోజు 28వ తేదీ ఉదయం వరకు వరంగల్‌, ఖమ్మం జిల్లాల నుంచి కొన్ని పోలింగ్‌ బాక్సులు స్ట్రాంగ్‌ రూమ్‌కు చేరే అవకాశం ఉంది. పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్‌ బాక్సులను నల్లగొండకు తెప్పించనున్నారు. ఆర్జాలబావి గోదాములోని స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో రాజకీయ ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్‌ బాక్స్‌లను భద్రపరచనున్నారు. వచ్చే నెల 3వ తేదీన నల్లగొండలోనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో 77 పోలింగ్‌ కేంద్రాలు

ఫ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌

ఫ 72 సాధారణ, 5 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

ఫ ఉమ్మడి జిల్లాలో ఓటర్లు 8,331 మంది

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఫ కలెక్టర్‌ హనుమంతరావు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హనుమంతరావు తెలిపారు. భువనగిరి మండలం రాయగిరిలోని విద్యాజ్యోతి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను అదనపు కలెక్టర్‌ వీరారెడ్డితో కలిసి బుధవారం సందర్శించారు. పోలింగ్‌ సిబ్బందికి బ్యాలెట్‌ బాక్సులు, ఇతర పోలింగ్‌ సామగ్రి పంపిణీని దగ్గరుండి పర్యవేక్షించారు. ఎన్నికల నిబంధనలను అవగాహన చేసుకుని విధులు నిర్వర్తించాలని పోలింగ్‌ అధికారులకు సూచించారు. టింగ్‌ గోప్యతను ఖచ్చితంగా పాటించాలన్నారు. మండలానికి ఒకటి చొప్పున 17 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాను ఆరు రూట్లుగా విభజించామని పోలింగ్‌ నిర్వహణకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు 17, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు 17, మైక్రో అబ్జర్వర్లు 17, సాధారణ సిబ్బంది 34 మందిని నియమించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. పోలింగ్‌ కేంద్రాలకు ఒకరు చొప్పున ఆరుగురు సెక్టార్‌ ఆఫీసర్లను నియమించామని చెప్పారు.

బొమ్మలరామారం

పోలింగ్‌ బూత్‌లో ఆరుగురే ఓటర్లు

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 984 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని తెలిపారు. బొమ్మలరామారం పోలింగ్‌ కేంద్రం నంబర్‌ 126లో ఆరుగురు ఓటర్లే ఉన్నారని , ఇందులో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో

వెబ్‌కాస్టింగ్‌ ద్వారా చిత్రీకరణ

పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ ప్రక్రియను చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్‌ వెంట భువనగిరి, చౌటుప్పల్‌ ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేడే టీచర్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌1
1/2

నేడే టీచర్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌

నేడే టీచర్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌2
2/2

నేడే టీచర్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement