ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులు
ఫోన్ పే, గూగుల్ పే ద్వారా టికెట్లు తీసుకునే సౌకర్యం
ఐదు డిపోలకు ఐ–టిమ్స్ వచ్చాయి
నల్లగొండ రీజియన్ పరిధిలోని దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ, కోదాడ డిపోలకు మొదటి విడతలో 310 ఐ– టిమ్స్ వచ్చాయి. సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లి డిపోలకు రెండవ విడతలో వస్తాయి. ఐ– టిమ్స్‌ను వచ్చే నెలలో అమలులోకి తెస్తాం. దూర ప్రాంతాలతో పాటు ప్రధాన కేంద్రాలకు ముందుగా అమలు చేస్తాం. ఆ తరువాత అన్ని బస్సుల్లో పూర్తిస్థాయిలో ఐ– టిమ్స్‌ను అందుబాటులోకి తెస్తాం.
– కొణతం జాన్‌రెడ్డి, ఆర్‌ఎం నల్లగొండ
మొదటి విడతలో వచ్చిన ఐ – టిమ్స్
డిపో ఐ – టిమ్స్
దేవరకొండ 80
మిర్యాలగూడ 50
నల్లగొండ 100
కోదాడ 80
మొత్తం 310
●
ఫ ఆన్‌లైన్ రిజర్వేషన్, స్వైపింగ్ సౌకర్యం కూడా..
ఫ తొలి విడతలో 310 ఐ – టిమ్స్ కొనుగోలు చేసిన సంస్థ
ఫ మార్చి మూడవ వారం నుంచి ప్రవేశపెట్టే అవకాశం
మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్‌టీసీ) బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తేనుంది. ఆర్టీసీ బస్సుల్లో ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్ (ఐ– టిమ్స్)ను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. బస్సుల్లో నగదు చెల్లించేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బస్సు పాస్ కౌంటర్లల్లో మాత్రమే డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి బస్సులతో పాటు టికెట్ రిజర్వేషన్ కేంద్రాలు, అదీకృత టికెట్ బుకింగ్ ఏజన్సీల్లోనూ డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పించాలని సంస్థ భావిస్తోంది.
15 నిమిషాల ముందు వరకు ఆన్‌లైన్ రిజర్వేషన్
ప్రస్తుతం దూర ప్రాంతాలకు బయలుదేరే సర్వీసులకు బస్సులు బయలుదేరే గంట ముందు ఆన్‌లైన్ రిజర్వేషన్లు నిలిపివేస్తున్నారు. ఈ ఐ–టిమ్స్‌తో ఇక ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. బస్సు మొదటి స్టేజి నుంచి ప్రారంభమయ్యాక ఆ మార్గంలో తరువాత వచ్చే స్టాప్‌లో బస్సులు ఎక్కదలుచుకున్న ప్రయాణికులు ఆన్‌లైన్‌లో 15 నిమిషాల ముందు వరకు టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. ఎంత సమయంలో బస్సు వారి స్టాప్‌కు వస్తుందనే సమాచారం కూడా ఈ ఐ–టిమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఐ – టీమ్స్‌లోని సాంకేతికత ఆధారంగా ఎప్పటికప్పుడు లోకేషన్ నిర్ధారణ అవుతుంది. ప్రయాణికులు బస్సెక్కిన వెంటనే రానున్న లోకేషన్‌కు అనుగుణంగా టికెట్ ఇష్యూ అవుతుంది. ఐ–టీమ్స్ (ఇది స్వైపింగ్ మిషన్‌లా కూడా పని చేస్తుంది) ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డులతో కూడా చార్జి చెల్లించవచ్చు.
పరిశీలనలో ఐ–టిమ్స్
నల్లగొండ రీజియన్ పరిధిలో యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ, దేవరకొండలో డిపోలు ఉండగా.. మొదటి విడతలో 310 వరకు ఐ–టిమ్స్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం వాటి పరిశీలన తుది దశలో ఉంది. కొద్దిపాటి మార్పుల అనంతరం మార్చి మూడవ వారం నుంచి బస్సుల్లో వీటిని అందుబాటులోకి తేనున్నారు.
ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులు
ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులు
ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులు
Comments
Please login to add a commentAdd a comment