ఇలా ఐతే.. చూపు మాయం!
పోషకాహారలోపం, సెల్‌ఫోన్ల వాడకంతో దృష్టి లోపం
భువనగిరి : ఒకప్పుడు వయస్సు మీరిన వారికి వచ్చే కంటి సమస్యలు ఇప్పుడు చిన్నారులకు సైతం వస్తున్నాయి. పోషకాహార లోపం, సెల్‌ఫోన్లు, టీవీలు ఎక్కువ సమయం చూడడంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. విద్యార్థుల శ్రేయస్సు కోసం రా ష్ట్రీయ బాల స్వస్థ్య (ఆర్‌బీఎస్‌కే) కార్యక్రమం, జిల్లా అంధత్వ నివారణ, సంస్థ, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17నుంచి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు.
2,785 మందికి దృష్టి లోపం
ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి, ఇంటర్ కళాశాలలో 36,351 మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించి 34,400 మందికి పూర్తి చేశారు. ఇందులో 2,785 మంది విద్యార్థులు దృష్టి లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరికి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 722 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా అందులో 30మందిని శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌లోని సరోజనీదేవి ఆస్పత్రికి రెఫర్ చేశారు. మిగిలిన వారికి కళ్లద్దాలు ఇవ్వనున్నారు.
కారణాలు ఇవీ..
ఖాళీ సమయంలో విద్యార్థులు సెల్‌ఫోన్లు, టీవీలు అధికంగా చూస్తుండడంతో కళ్లపై ప్రభావం పడి దృష్టి లోపం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా పౌష్టికాహారం లోపం కూడా కారణమని అంటున్నారు.
ఫ వందలో తొమ్మిది మందికి సమస్య
ఫ ఆర్‌బీఎస్‌కే నివేదికలో వెల్లడి
ఫ జిల్లాలో 34,400 మంది విద్యార్థులకు ఉచిత నేత్ర పరీక్షలు
ఫ 2,785 మందికి దృష్టి లోపం ఉన్నట్లు గుర్తింపు
దశలవారీగా కళ్లద్దాలు
2,785 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించాంవీరికి దశల వారీగా అద్దాలు అందజేస్తాం. చిన్నారులు పోషహకాహారం తీసుకోవాలి. సెల్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి. పిల్ల లు ఎక్కువ సమయం సెల్‌ఫోన్లు, టీవీలు చూడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి.
–డాక్టర్ ప్రశాంత్, ఆర్‌బీఎస్‌కే నోడల్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment