అఖండజ్యోతి యాత్ర ప్రారంభం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బర్కత్‌పురలోని యాదగిరిభవన్ నుంచి అఖండజ్యోతి యాత్ర బుధవారం ప్రారంభమైంది. యాత్రను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి ప్రారంభించారు.యాత్ర ఉప్పల్, ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి మీదుగా మార్చి 1వ తేదీన యాదగిరిగుట్టకు చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈఓ దోర్భల భాస్కర్‌శర్మ, అఖండ జ్యోతి యాత్ర చైర్మన్ ఎస్.వెంకట్‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ రాఘవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment