యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు | - | Sakshi
Sakshi News home page

యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు

Published Fri, Feb 28 2025 1:21 AM | Last Updated on Fri, Feb 28 2025 1:21 AM

యాదగి

యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు వైభవంగా నిర్వహించారు. వేవకుజామున సుప్రభాత సేవతో స్వామి, అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభూవులు, ప్రతిష్టామూర్తులను అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. అనంతరం ప్రధానాలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం చేశారు. ఆతరువాత స్వామి, అమ్మవారిని గజవాహన సేవలో ఊరేగించి నిత్య తిరుకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

ముగిసిన రాచకొండ పర్యాటక ఉత్సవాలు

సంస్థాన్‌ నారాయణపురం : రాచప్ప సమితి ఆధ్వర్యలో నిర్వహిస్తున్న రాచకొండలో నిర్వహిస్తున్న పర్యాటక ఉత్సవాలు గురువారం ముగిశాయి. భక్తులు, పర్యాటకులు ఉత్సవాల్లో పాల్గొని ఆలయాల్లో పూజలు నిర్వహించినారు. రాచకొండ చరిత్రను తెలియజేసే ఫొటో గ్యాలరీతో పాటు పర్యాటక ప్రదేశాలను వీక్షించారు. రాచప్ప సమితి ఆధ్యక్షుడు మాట్లాడుతూ రాచకొండను అభివృద్ధి చేసి పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్యక్రమంలో రాచప్ప సమితి ప్రధాన కార్యదర్శి సూరపల్లి వెంకటేశం, సలహాదారు, సభ్యులు కడారి అంజిరెడ్డి, దశరథ, గాలయ్య, యాదగిరిరెడ్డి, మాధవరెడ్డి, చంద్రారెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించాలి

భువనగిరి : జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ప్రారంభించి, అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం డీఆర్‌డీఓ నాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంభం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించకపోవడంతో కొందరికే ఉపాధి లభిస్తుందన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ జాబ్‌కార్డులు జారీ చేసి పని కల్పించాలని కోరారు. వేసవి దృష్ట్యా పని ప్రదేశాల్లో టెంట్లు, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘం జిల్లా ఉప్యాక్షుడు పల్లెర్ల అంజయ్య, సభ్యులు కొండపురం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

‘ఫుడ్‌ సేఫ్టీ’తనిఖీలు

భూదాన్‌పోచంపల్లి : పట్టణంలోని పలు కిరాణ దుకాణాల్లో గురువారం ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కందిపప్పు, టీ పొడి, బెల్లం తదితర పదార్థాలను పరిశీలించారు. ఓ షాపులో కందిపప్పు, టీపొడి నాణ్యతలో తేడా ఉండడంతో పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ సేకరించారు. సరుకులు లూజ్‌గా అమ్మవద్దని, బ్రాండెడ్‌ వస్తువులనే విక్రయించాలని దుకాణదారులకు ఫుడ్‌ కంట్రోలర్‌ జోనల్‌ అసిస్టెంట్‌ జ్యోతిర్మయి సూచించారు. టీపొడి, పప్పులు, పాలు ఎక్కువగా కల్తీ జరుగుతున్నట్లు గుర్తించామని, అందులో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డైయిరీ, చికెన్‌ సెంటర్లు, బిర్యానీ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి నాణ్యత పాటించని వారిపై కేసులు నమోదు చేశామని, షాపులను సీజ్‌ చేశామని చెప్పారు. కిరాణ షాపులకు తప్పనిసరిగా ఫుడ్‌ లైసెన్స్‌ ఉండాలన్నారు. ఆమె వెంట ఫుడ్‌ ఇనిస్పెక్టర్‌ స్వాతి, శాంపిల్‌టేకర్‌ రమేశ్‌, నర్సింహ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు  1
1/2

యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు

యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు  2
2/2

యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement