
పన్నుల వసూళ్లలో వేగం పెంచండి
భూదాన్‌పోచంపల్లి : పన్నుల వసూళ్లలో వేగం పెంచి గడువులోపు లక్ష్యాన్ని చేరుకోవాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. గురువారం సాయంత్రం భూదాన్‌పోచంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలోని అన్ని చాంబర్లలో కలియదిరిగారు.అనంతరం రికార్డులను పరిశీలించారు.ఆస్తిపన్నుపై ఆరా తీశారు.డిమాండ్ ఎంత, ఇప్పటి వరకు ఎంత వసూలైంది, వార్డు ఆఫీసర్లు రోజుకు ఎంత వసూలు చేస్తున్నారు, బకాయిదారులకు నోటీసులు జారీ చేశారా.. అని తెలుసుకున్నారు. వసూలైన పన్నును ఏరోజుకారోజు బ్యాంకులో జమ చేయాలని మున్సిపల్ కమిషనర్ అంజిరెడ్డికి సూచించారు. గ్రీన్ బడ్జెట్ ఎంత ఉందని అడిగారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అదే విధంగా సమీకృత మార్కెట్, అర్బన్‌పార్కు, పబ్లిక్ టాయిలెట్లు, నర్సరీలు, బృహత్ పట్టణ ప్రకృతి వనాల ప్రగతిపై ఆరా తీశారు. అర్బన్ పార్కు పనులు మొదలు కాలేదని తెలుసుకుని పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈతో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే రీటెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌ఎండీఏ లేఅవుట్ల రిజిస్టర్ నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. ఆయన వెంట ఇంచార్జి తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఆదిత్య, రాజేశ్, వార్డు ఆఫీసర్లు ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment