యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో జరుగుతున్న మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వేద పండితులు నిత్య హవనములు, శివ పంచాక్షరి జపాలు, నందీశ్వర పారాయణాలు, పంచసూక్త పఠనాలు చేపట్టారు. అనంతరం గర్భాలయంలో మహాశివుడికి, స్పటిక లింగానికి లక్ష బిల్వార్చన, అభిషేకం తదితర పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. సాయంత్రం నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కల్యాణమూర్తులైన శివపార్వతులను రథంలోకి వేంచేపు చేసి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అర్ధనా రీశ్వర రూపంలో పార్వతీ పరమేశ్వరులను ఏకరూపంలో దర్శనం కలిగించు రథోత్సవ వేడుక ఎంతో మహత్తరమైందని, అద్వైత జ్ఞాన ప్రకాశమని శివ పురాణం తెలియజేస్తుందని అర్చకులు వెల్లడించారు. రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
నేటితో ఉత్సవాలు పరిసమాప్తం
శివాలయంలో ఈనెల 23వ తేదీన మొదలైన మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం పరిసమాప్తం కానున్నాయి. మధ్యాహ్నం పూర్ణాహుతి, రాత్రి స్వామి, అమ్మవారికి డోలోత్సవంతో ఉత్సవాలకు అర్చకులు ముగింపు పలకనున్నారు.
ఫ యాదగిరిగుట్ట శివాలయంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు
ఫ శివుడికి అభిషేకం, లక్ష బిల్వార్చన
Comments
Please login to add a commentAdd a comment