
కొత్త టీచర్లకు పాఠాలు
భువనగిరి : డీఎస్సీ–2024 ద్వారా నియమితులైన 248 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో వృత్యంతర శిక్షణ ఇస్తున్నారు. మూడు విడతల్లో భాగంగా తొలుత ఫిబ్రవరి 28న ఎస్‌జీటీలకు భువనగిరిలోని సాయికృప డిగ్రీ కళాశాలలో శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. శిక్షణ ఈ నెల 1,3 తేదీల్లో కొనసాగనుంది. రెండో విడతలో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులకు 4, 5, 6వ తేదీల్లో నల్లగొండలో, స్పెషల్ ఎడ్యుకేషన్, పీఈటీలకు హైదరాబాద్‌లో 10, 11, 12వ తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
వీటిపై శిక్షణ
పాఠ్యపుస్తకాల సద్వినియోగం, తరగతి గది నిర్వహణ, విద్య, అభ్యసన, ప్రమాణాల పెంపు, పాఠ్య ప్రణాళికలు, మూల్యాంకన పద్ధతులు, విధానాలు, ఐసీటీ, ఐఎఫ్‌పీ, డిజిటల్ బోధన, తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.
కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులు
డీఎస్సీ–2024 ద్వారా జిల్లాలో 251మందికి గాను 248 మంది ఉపాధ్యాయ పోస్టుల్లో నియామకం అయ్యారు. వీరిలో ఎస్‌జీటీలు 133, పీఈటీలు ఇద్దరు, మిగిలిన వారు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రస్తుతం 133 మంది ఎస్‌జీటీలు, ఎనిమిది మంది ఆర్‌పీలకు భువనగిరిలోని సాయికృప డిగ్రీ కళాశాలలో శిక్షణ మొదలైంది. వీరికి టీఏతో పాటు భోజన వసతి కల్పిస్తున్నారు.
అభ్యసన ప్రక్రియలపై తర్ఫీదు
ఫ మూడు దశల్లో శిక్షణ
ఫ తొలుత ఎస్జీటీలకు, రెండు, మూడో విడతలో స్కూల్ అసిస్టెంట్లు,భాషా పండితులు, పీఈటీలకు
ఫ డీఎస్సీ–2024 ద్వారా 248 మంది ఉపాధ్యాయుల నియామకం
సద్వినియోగం చేసుకోవాలి
కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులకు వృత్తిపరమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నాం. విడుతల వారీగా శిక్షణ ఇస్తున్నాం. ఎస్‌జీలకు మాత్రమే భువనగిరిలో శిక్షణ ఇస్తున్నారు. మిగతా వారికి నల్లగొండ, హైదరాబాద్‌లో ఉంటుంది. శిక్షణ ద్వారా తరగతి గది నిర్వహణ, విద్యా ప్రమాణాల పెంపు, బోధన, అభ్యసన ప్రక్రియలపై అవగాహన ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని కొత్త టీచర్లు సద్వినియోగం చేసుకోవాలి.
–సత్యనారాయణ, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment