
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
భువనగిరి : విద్యార్థులు పోషకాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్ పేర్కొన్నారు. స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 89 ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.భువనగిరిలోని ఆర్‌బీ నగర్‌లో గల ఎస్సీ బాలికల హాస్టల్‌ను డీఎంహెచ్‌ఓ సందర్శించి వైద్యపరీక్షలను పరి శీలించారు. విద్యార్థులకు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ యశోద, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సుమన్ కళ్యాణ్, వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment