
సమ్మర్.. ఫ ుల్ పవర్
ప్రస్తుతం 8.5 మిలియన్ యూనిట్లు..
ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ఇళ్లలో ప్యాన్లు, ఏసీలు, కూలర్ల వాడకం పెరిగింది, మరోవైపు వరి చేలు పొట్టదశలో ఉండడంతో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం అధికమైంది. ప్రస్తుతం జిల్లాలో విద్యుత్ వినియోగం రోజూ 8.5 మిలియన్ యూనిట్లు ఉండగా మున్ముందు 9.5 మిలియన్ యూనిట్లకు చేరనుందని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు సిద్దంగా ఉన్నారు.
వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా యాక్షన్ ప్లాన్
భువనగిరి : ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం అధికమవుతోంది. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, మీటర్లు కాలిపోవడం, లైన్లలో లోపం తదితర అంశాలు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో విద్యుత్ శాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. వేసవిలో కోతలు లేని కరెంట్ సరఫరా చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఇందులో కొన్ని పనులు పూర్తి కాగా, మరికొన్ని తుది దశలో ఉన్నాయి.
అదనంగా వీటిని
ఏర్పాటు చేశారు
జనవరి నెలలో జిల్లాలో విద్యుత్ వినియోగం 7.9 మిలియన్ యూనిట్లు ఉండగా ఫిబ్రవరి రెండో వారం నాటికి 8.2 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఎండలు ముదరడంతో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. దీంతో లో ఓల్టేజీ, బ్రేక్‌డౌన్‌లు, లైన్లలో లోపాలు తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. సమస్యలను అధిగమించి నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా అదనంగా నూతన సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు ఏర్పాటు చేస్తున్నారు. మూడుసబ్ స్టేషన్లకు గాను రెండు పూర్తికాగా మరొకటి తుదిదశలో పనులు ఉన్నాయి. పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏడు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 101, 11 కేవీ ఫీడర్లు 26, 33 కేవీ ఫీడర్లు ఒకటి, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను 101 ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా అన్నీ పూర్తయ్యాయి. మరమ్మతులకు గురైతే విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఫీడర్లను వేరు చేసేలా 10 చోట్ల వీసీబీలను బిగించారు.
రోజూ టీసీలు, ప్రతి సోమవారం వీసీలు
ఎస్‌ఈ, డీఈలు, రక్షేత సిబ్బందితో విద్యుత్ శాఖ సీఎండీ రోజూ టెలీకాన్ఫరెన్స్(టీసీ), ప్రతి సోమవారం వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వహించి విద్యుత్ సరఫరా, సమస్యలపై సమీక్షిస్తున్నారు. దీంతో జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నారు.
ఫిర్యాదు చేయాల్సిన నంబర్ 9491065938
విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేయడానికి ప్రజల సౌకర్యార్థం ట్రాన్స్‌కో జిల్లా కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్‌రూంలో 9491065938 నంబర్ కూడా అందుబాటులో ఉంచారు. వినియోగదారులు నేరుగా లేదా ఫోన్ నంబర్‌కు కాల చేసి సమస్యను తెలియజేస్తున్నారు. సిబ్బంది తక్షణమే అప్రమత్తమై సమస్యలను పరిష్కరిస్తున్నారు.
ఫ డిమాండ్‌కు అనుగుణంగా కరెంట్ సరఫరా చేసేందుకు చర్యలు
ఫ అదనంగా సబ్‌స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్‌ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు ఏర్పాటు
ఫ ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనేపరిష్కరించేందుకు కంట్రోల్ రూం
ఫ టెలీకాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్న సీఎండీ
ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నాం
వేసవిలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తున్నాం. ఉన్నతస్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అప్రమత్తంగా ఉన్నాం. బ్రేక్‌డౌన్లు, లో ఓల్టేజీ, మరమ్మతులు.. ఏ సమస్య వచ్చినా యుద్ధప్రాతిపదికన పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నాం. ఏ చిన్న సమస్య వచ్చినా ఫిర్యాదు చేసేందుకు జిల్లా కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచాం. కంట్రోల్ రూంకు నేరుగా, సెల్ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం.
–ఆర్.సుధీకర్‌కుమార్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ
కొత్తగా ఏర్పాటు చేసినవి
సబ్‌స్టేషన్లు 02
పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు 07
డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 101
11 కేవీ ఫీడర్లు 26
33 కేవీ ఫీడర్లు 01
వీసీబీలు 10
విద్యుత్ కనెక్షన్లు ఇలా..
మొత్తం 4,46,443
వ్యవసాయ 1,17,476
గృహ 2,76,045
పరిశ్రమలు 603 (హైటెన్షన్)
పరిశ్రమలు 3,210(లోటెన్షన్ )
ఇతర 50 వేలకు పైగా..

సమ్మర్.. ఫ ుల్ పవర్
Comments
Please login to add a commentAdd a comment