
‘గుట్ట’కు చేరిన అఖండజ్యోతి
భువనగిరి, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చేపట్టిన అఖండజ్యోతి యాత్ర శనివారం రాత్రి యాదగిరిగుట్టకు చేరింది. గత నెల 26వ హైదరాబాద్ బర్కత్‌పురలోని యాదగిరి భవన్‌నుంచి ప్రారంభమైన అఖండజ్యోతి యాత్ర.. ఉప్పల్, ఘట్‌కేసర్, బీబీనగర్ మీదుగా శుక్రవారం రాత్రి భువనగిరిలోని పాత వివేరా హోటల్ వద్దకు చేరుకుంది. శనివారం ఉదయం వివేరా హోట్‌ల నుంచి బయలుదేరి యాదగిరిగుట్టకు చేరుకుంది. భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, యాదగిరిగుట్టలో ఏసీపీ రమేష్ పూజలు నిర్వహించారు. యాత్ర భువనగిరి పట్టణ అధ్యక్షుడు ఫక్కీర్ కొండల్‌రెడ్డి, చైర్మన్ సద్ది వెంకట్‌రెడ్డి, నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, బర్రె జహంగీర్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కూర వెంకటేశం, సభ్యులు దేవరకొండ నర్సింహాచారి, ఉపేందర్‌రావు, బాలాజీ, యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు, హిందూ సంఘాల నాయకులు అఖండజ్యోతికి ఘన స్వాగతం పలికారు.

‘గుట్ట’కు చేరిన అఖండజ్యోతి
Comments
Please login to add a commentAdd a comment