
మూసీ శుద్ధీకరణకు డీపీఆర్ తయారు చేయాలి
భూదాన్‌పోచంపల్లి : మూసీ శుద్ధీకరణను సీపీఎం స్వాగతిస్తుందని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి డీపీఆర్ తయారు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్.వీరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన సీపీఎం జిల్లా నాయకత్వ స్థాయి శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. మూసీ కలుషిత జలాల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, పంటలు పండడం లేదని, పాడిపరిశ్రమపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి మూసీ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ మూసీ శుద్ధీకరణలో ఈటీపీలు, ఎస్‌టీపీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పార్టీ జెండావిష్కరించి అమరవీరులకు సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, భట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జల్లెల పెంటయ్య, గూడూరు అంజిరెడ్డి, శ్రీనివాసచారి, మండల కార్యదర్శి కోట రాంచంద్రారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ, బొల్లు యాదగిరి, ఎంపీ పాష, బొడ్డుపల్లి వెంకటేశ్, గుండు వెంకటనర్సు, సైదులు, యాదిరెడ్డి, అవ్వారు రామేశ్వర్, ఎంఏ ఇక్భాల్, వనం ఉపేందర్, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గడ్డం వెంకటేశం, రాగీరు కిష్టయ్య, కరుణాకర్, గణపతిరెడ్డి, అంజయ్య, శ్రీశైలం, జహాంగీర్, జగన్, అనిల్, మధు, భిక్షపతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
ఎస్. వీరయ్య
Comments
Please login to add a commentAdd a comment