భువనగిరి : విద్యార్థుల్లో కంటిచూపు సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమ సంయుక్త సంచాలకుడు డాక్టర్ మోతీలాల్‌నాయక్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్ సూచించారు. శనివారం భువనగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్థులకు నిర్వహిస్తున్న నేత్ర పరీక్షలను వారు పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 34,400 మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయగా 2,785 మందికి దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీరికి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రీస్క్రీనింగ్ చేస్తున్నట్లు తెలిపారు. రీ స్క్రీనింగ్‌లోనూ దృష్టిలోపం ఉన్నట్లు తేలితే వారికి శస్త్ర చికిత్సకు రెఫర్ చేయడంతో పాటు కళ్ల అద్దాలు అందజేస్తామని చెప్పారు. పాఠశాలల్లో నిర్వహించే కంటి పరీక్షలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment