యాదగిరిగుట్ట : సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌కు చెందిన కందుల సురేందర్‌రావు–తిరుమలదేవి దంపతులు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారికి రూ.60 వేలు విలువ చేసే గొడుగులు, కర్రలు బహూకరించారు. వీటిని ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, డీఈఓ భాస్కర్‌శర్మకు ఆదివారం అందజేశారు. స్వామివారి నిత్యారాధనల్లో భాగంగా నిర్వహించే జోడు సేవకు గొడుగు, కర్రలను వినియోగించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీస్వామి వారి అలంకార, వాహన సేవల్లోనూ వాటిని వినియోగించాలని అధికారులను కోరారు.
ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, డీఈఓ భాస్కర్‌శర్మకు గొడుగులు అందజేస్తున్న సురేందర్‌రావు దంపతులు
Comments
Please login to add a commentAdd a comment