
టెన్త్ విద్యార్థులకు 6నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు
భువనగిరి : పదో తరగతి విద్యార్థులకు ఈనెల 6నుంచి 13వ తేదీ వరకు ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదివారం షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పటికే ఫ్రీ ఫైనల్ ప్రాక్టీస్ పరీక్ష – 1,2 పూర్తయ్యింది. ఈ పరీక్షలను మధ్యాహ్నం 1.15నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు నిర్వహించారు. కాగా 6నుంచి జరిగే ఫ్రీ ఫైనల్ పరీక్షల వేళల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులు 8,631 మంది విద్యార్థులు ఉన్నారు. ఫ్రీ ఫైనల్ పరీక్షల వేళల్లో మార్పుల కారణంగా ఉర్దూ పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనున్నాయి.
మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు నివాళి
భువనగిరిటౌన్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి శ్రీపాదరావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక
మోటకొండూర్ : మండల కేంద్రానికి చెందిన చామల భానుచందర్‌రెడ్డి – అర్చన దంపతుల కూతురు చామల లక్ష్మీఅభయారెడ్డి జాతీయస్థాయి అర్చరీ పోటీలకు ఎంపికై ంది. ఆదివారం హైదరాబాద్ కొల్లూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో అండర్–10 విభాగంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో లక్ష్మీఅభయారెడ్డి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈనెల 22వ తేదీన విజయవాడలో జరిగే జాతీ యస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొననుంది. లక్ష్మీఅభయారెడ్డి హైదరాబాద్ ఉప్పల్‌లోని మెరిడియన్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువు తుంది. రాష్ట్ర అర్చరీ అసోషియేషన్ చైర్మన్ టి. రాజు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూర్ బ్రాంచ్ చైర్మన్ ఎండీ పవన్‌కళ్యాణ్, మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ రామారావు చేతుల మీదుగా బంగారు పతకం అందజేశారు. లక్ష్మీ అభయారెడ్డికి, కోచ్ వరికుప్పల స్రవంతికి పలువురు అభినందనలు తెలిపారు.
రెండో విడత సర్వేపూర్తి
భువనగిరిటౌన్ : పట్టణంలో సమగ్ర కుటుంబ రెండో విడత సర్వే పూర్తయినట్లు భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేలో పాల్గొనని కుటుంబాల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 16నుంచి 28 వ తేదీ వరకు 12 రోజుల పాటు సర్వే చేపట్టినట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో పాల్గొనని 18 కుటుంబాలు రెండో దశ సర్వేలో పాల్గొన్నాయని వెల్లడించారు. ప్రజాపాలన సేవా కేంద్రాలు, టోల్ ఫ్రీనంబర్ ద్వారా, ఆన్‌లైన్‌లో ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు.

టెన్త్ విద్యార్థులకు 6నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment