ఇంద్రియాలలో మద్యపాన నిషేధం
భూదాన్‌పోచంపల్లి : గ్రామంలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతుండడంతో ఊరి జనమంతా ఒక్కటయ్యారు. గ్రామంలో బెల్టుషాపులను నిషేధిస్తూ ఆదివారం ఏకగీవ్ర తీర్మానం చేశారు. బెల్ట్ దుకాణాలు ఉండకూడదని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. మద్యం విక్రయిస్తే రూ.25 వేల జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి రూ.5,000 బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ బండి కృష్ణగౌడ్ మాట్లాడుతూ బెల్ట్ షాపుల వల్ల గ్రామంలో చాలా మంది మద్యానికి బానిసలు అవుతున్నారని, కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయన్నారు. ముఖ్యంగా మహిళల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు గ్రామంలో మద్యాన్ని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మద్యం అమ్మకాలను నిషేధించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎం.యాదగిరి, అఖిలపక్ష నాయకులు పబ్బు యాద య్య, బీమగాని నర్సింహ, ఎర్ర చిన్న శంకరయ్య, ఉడుతల సాయిరాం, పానుగంటి లింగస్వామి, బద్దం రాజేశ్వర్, గరిసె జంగయ్య, షేక్ ఇబ్రహీం, చింతల రామకృష్ణ, మహిపాల్‌నాయక్, శ్రీహరి, శ్రీకాంత్, వంగేటి జంగారెడ్డి, శంకరయ్య, సురేశ్, గోపాల్, ఎర్ర లక్ష్మణ్, శెట్టి మల్లేశ్, గడ్డం శెట్టి, భిక్షపతి, విక్రమ్, రాజు, సత్తయ్య, సుర్వి బాలరాజు, రసూల్ తదితరులు పాల్గొన్నారు.
ఫ విక్రయిస్తే రూ.25వేలు జరిమానా, గ్రామస్తుల తీర్మానం
Comments
Please login to add a commentAdd a comment