పట్టు వస్త్రాలు అందజేత
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీస్వామి, అమ్మవార్లకు హైదరాబాద్‌కు చెందిన గడ్డమీది యాదగిరిగౌడ్– భారతి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆదివారం గర్భాలయంలో స్వయంభూల చెంత పట్టు వస్త్రాలకు పూజలు చేయించారు. అనంతరం డీఈఓ భాస్కర్‌శర్మ, ఆలయ అధికారి గజివెల్లి రఘు సమక్షంలో అర్చకులకు పట్టువస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ లోకల్ అడ్బయిజరీ మాజీ సభ్యుడు వడ్లోజు వెంకటేష్, గడ్డమీది శ్రావణ్‌గౌడ్ పాల్గొన్నారు.
గుట్ట ఆలయ అర్చకుడు, అధికారులకు పట్టువస్త్రాలు అందజేస్తున్న భక్తుడు గడ్డమీది యాదగిరిగౌడ్ దంపతులు
Comments
Please login to add a commentAdd a comment