
ఆకట్టుకుంటున్న సాంస్కృతిక ప్రదర్శనలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. సోమవారం భజన కార్యక్రమాలు, పోతన భాగవత అంతర్గత రహస్యాలు, నవ విధ భక్తి తత్త్వంపై ఉపన్యాసం, పాల రామాంజనేయ హరికథ, శాసీ్త్రయ సంగీతం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. సాయంత్రం గరికపాటి నరసింహరావు శ్రీనృసింహ వైభవం గురించి ప్రవచించారు. కొండ కింద గల దీక్షపరుల మండపంలో భక్తులకు ఉచిత అన్నదానం చేశారు. ఆలయ సన్నిధిలో మేడ్చల్–మలా్‌క్‌జ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని నీలిమ ఆస్పత్రి ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత వైద్య శిబిరం కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment