
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
భువనగిరి: బంధువుల ఇంట్లో పండుగకు వచ్చిన వ్యక్తి తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన ఒంటెద్దు అచ్చయ్య ఈ నెల 1వ తేదీన భువనగిరి మండలం నందనం గ్రామంలో తమ బంధువులు బాలమ్మ పండుగ చేస్తే వచ్చాడు. మరుసటి రోజు ఉదయం తిరిగి స్వగ్రామానికి బయల్దేరిన అచ్చయ్యను భువనగిరికి వెళ్లే ఆటోలో బంధువులు ఎక్కించారు. కానీ అచ్చయ్య ఇంటికి చేరుకోలేదు. అచ్చయ్య కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. అచ్చయ్య గోధుమ రంగు షర్ట్, ప్యాంట్ ధరించాడని, అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అచ్చయ్య కుమార్తె అఖిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment