
దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా..
నకిరేకల్: దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు, యువతి మృతిచెందారు. ఈ ఘటన నకిరేకల్ పట్టణ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి బైపాస్ ఫ్లైఓవర్ సమీపంలో సోమవారం తెల్ల వారుజామున జరిగింది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి నల్గొండ ప్రభు(27) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభుకు వివాహం కాగా.. భార్యాభర్తల మధ్య తగాదాలతో విడిపోయారు. తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికే చెందిన పూలుగుజ్జు నరేష్ సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన వైష్ణవి(25)ని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. నరేష్, వైష్ణవిల మధ్య కూడా మనస్పర్ధలు రావడంతో గత రెండేళ్ల నుంచి వైష్ణవి తన తల్లిగారి ఊరైన టేకుమట్లలో పిల్లలతో కలిసి ఉంటుంది.
చెర్వుగట్టుకు వెళ్లి వస్తూ..
వైష్ణవితో ఉన్న పరిచయం మేరకు టేకుమట్ల నుంచి ఆమెను తీసుకుని ప్రభు ఆదివారం రాత్రి నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవాలయానికి వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున వారు చెర్వుగట్టు నుంచి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. వయా నల్ల గొండ, తాటికల్ మీదుగా నకిరేకల్‌కు చేరుకున్నారు. అనంతరం వీరు నకిరేకల్ పట్టణ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి బైపాస్ మీదకు రాంగ్ రూట్‌లో ఎక్కి సూర్యాపేట వైపు కొద్దిదూరం వెళ్లగానే ఎదురుగా గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రభు, వైష్ణవికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడు ప్రభు సోదరుడు ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అనుమానం వచ్చి పోస్టుమార్టం..
నకిరేకల్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ లచ్చిరెడ్డి ఆస్పత్రి వద్దకు చేరకుని మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అనుమానంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో ఫోన్సిక్ నిపుణులచే పోస్టుమార్టం చేయించాలని డాక్టర్లు తెలిపారు. దీంతో ప్రభు, వైష్ణవి మృతదేహాలను నల్లగొండ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం రిపోర్టులో రోడ్డు ప్రమాదంలో చనిపోయారని నిర్ధారణ కావడంతో పోలీసులు వారిద్దరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు, యువతి దుర్మరణం
నకిరేకల్ పట్టణ శివారులో భైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం

దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా..

దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా..
Comments
Please login to add a commentAdd a comment