బీబీనగర్ పెద్దచెరువు ట్యాంక్‌బండ్ పనులకు శంకుస్థాపన చేసి 18 నెలలు గడిచినా పనుల్లో కదలిక లేదు.
అన్ని వర్గాలకు అనుకూలం
రాష్ట్ర బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుందని, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని మంత్రి వెంకటర్‌రెడ్డి అన్నారు.
- IIIలో
- IIలో
టీఎస్ ఐపాస్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి పరిశ్రమలు ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఐదో స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా నిలువగా, నల్లగొండ 12వ స్థానంలో నిలిచింది. సూర్యాపేట 23వ స్థానంలో నిలిచింది. యాదాద్రి జిల్లాలో 1032 పరిశ్రమలు ఏర్పాటు ద్వారా రూ.5598 కోట్ల పెట్టుబడులు రాగా, 34,876 మందికి ఉపాధి లభించింది. నల్లగొండ జిల్లాలో 693 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.4344 కోట్ల పెట్టుబడులు రాగా, 17,220 మందికి ఉపాధి లభించింది. సూర్యాపేట జిల్లాలో 330 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.5207 కోట్ల పెట్టుబడులు లభించగా, 10,439 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
ఒక్క సంవత్సరంలోనే..
2024–25 ఆర్థిక సంవత్సరంలో యాదాద్రి జిల్లాలో 93 కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాగా రూ.222 కోట్ల పెట్టుబడులు వచ్చి 1666 మందికి ఉపాది లభించింది. నల్లగొండలో 56 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.955 కోట్ల పెట్టుబడులు రాగా, 2053 మందికి ఉపాధి లభించింది. సూర్యాపేట జిల్లాలో 26 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.67 కోట్లు రాగా, 516 మందికి ఉపాధి లభించింది.
విద్యుత్ కనెక్షన్లలో టాప్
పరిశ్రమల ద్వారా యాదాద్రికి రూ.5598 కోట్ల పెట్టుబడులు
పనులు ప్రారంభమయ్యేనా