
అంబేడ్కర్‌కు నివాళి
భువనగిరిటౌన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు ఆదివారం జిల్లా కేంద్రంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభం అయ్యాయి. భువనగిరిలోని అంబేడ్కర్ విగ్రహానికి మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మా ట్లాడుతూ.. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు హక్కులను పొందగలుగుతున్నా మని పేర్కొన్నారు. అనంతరం సాంస్కృతిక సారధి అధ్వర్యంలో నిర్వహించిన ఆటా పాట అలరించింది.
భువనగిరిలోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు