
ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
భువనగిరి టౌన్ : సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అర్హత కలిగిన పేదలందరికీ ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలో ఇళ్లు లేని పేదలు ఎంతోమంది ఉన్నారని, వారంతా అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆలేరు మండలం కొలనుపాకలో సర్వే నంబర్ 8లో మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఖా ళీగా ఉందని, అర్హులైన పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలేరు తహసీల్దార్‌కు దరఖాస్తులు కూడా అందజేశామని పేర్కొన్నారు. స్పందించకపోతే పోరుబాట పడుతామన్నారు. అనంతరం కలెక్టర్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్, నాయకులు పొన్నబోయిన రవి, పోతు ప్రవీణ్, ఉపేందర్, భవాని, సంపత్, పార్వతి, సంధ్య, సరిత తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా