
అతివలకు ఆర్థిక భరోసా..
నాడు కూలీ.. నేడు పాడి పరిశ్రమ
ఆత్మకూర్(ఎం) మండలం రహీంఖాన్‌పేటకు చెందిన తాల్లపెళ్లి అరుణ కావేరి మహిళా సంఘంలో సభ్యురాలు. అంతకుముందు ఉపాధిహామీ పనులకు వెళ్లేంది. సీ్త్రనిధి పథకం కింద బ్యాంకు నుంచి రూ.1లక్ష చొప్పున మూడు దఫాలు రుణం తీసుకుంది. అట్టి డబ్బుతో వ్యవసాయ బావి వద్ద పాడి పరిశ్రమ ఏర్పాటు చేసింది. గ్రామంలోని పాల కేంద్రంలో పాలు పోస్తుంది. సీ్త్రనిధి అప్పు పోను నెలకు రూ.15వేల వరకు ఆదాయం వస్తుందని అరుణ తెలిపారు.
ఉద్యోగం రాలేదని కుంగిపోకుండా..
ఆత్మకూర్(ఎం) మండల కేంద్రానికి చెందిన బూడిద గిరిజ లక్ష్మీసరస్వతి సంఘంలో సభ్యురాలు. సీ్త్రనిధి కింద లక్ష రూపాయలు రుణం తీసుకుంది. ఆ డబ్బుతో గ్రామంలోనే లేడీస్ కార్నర్ ఏర్పాటు చేసింది. నెలకు రూ.2700 కిస్తు చెల్లిస్తుంది. కిస్తు, ఖర్చులు పోను నెలకు రూ.20 వేలు సంపాదిస్తుంది. పాలిటెక్నిక్ చదివిన గిరిజ ఉద్యోగం రాలేదని కుంగిపోకుండా.. సీ్త్రనిధి రుణంతో స్వయం ఉపాధి పొందుతుంది.
స్త్రీనిధి పథకం ద్వారా విరివిగా రుణాలు
ఫ వివిధ వ్యాపారాల్లో స్థిరపడిన
స్వయం సహాయక సంఘాల సభ్యులు
ఫ జిల్లాలో 18,106 సంఘాలు
ఫ రూ.790 కోట్ల రుణాలు పంపిణీ
ఆత్మకూరు(ఎం): ఒకప్పుడు కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకుంటూ, కూలీ పనులతో జీవనం సాగించిన మహిళలు.. నేడు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. చేతి నిండా పని.. డబ్బుతో సంతోషంగా ఉంటున్నారు. సీ్త్రనిధి రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.
సంఘాలు, సభ్యులు..
జిల్లాలోని 17 మండలాల్లో 18,106 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో 1,85,362 మంది సభ్యులు ఉన్నారు. అందులో 15,432 సంఘాల్లో 1,11,716 మంది మహిళలు సీ్త్రనిధి పథకం కింద రూ.790 కోట్ల రుణాలు పొందారు. రుణం డబ్బులతో పాడి పరిశ్రమ, బ్యూటీపార్లర్, లేడీస్ కార్నర్, కిరాణం, వస్త్ర దుకాణాలు, గొర్రెల పెంపకం తదితర వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. సీ్త్రనిధి రుణాల మంజూరులో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రస్థాయిలో 13వ స్థానంలో ఉంది.
ఆత్మకూర్(ఎం)కు చెందిన జోష్న ఇంటర్ పూర్తి చేసింది. తోటి మహిళల సూచన మేరకు పల్లవి మహిళా సంఘంలో చేరింది. జీవనోపాధి నిమిత్తం బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకోగా లక్ష రూపాయలు మంజూరు చేసింది. ఈ డబ్బుతో కిరాణ షాపు ఏర్పాటు చేసింది. కిస్తు రూ.2,250, ఖర్చులు పోను నెలకు రూ.15వేలు సంపాదిస్తున్నట్లు తెలిపింది.
సొంత కాళ్లపై
నిలబడాలన్న లక్ష్యం

అతివలకు ఆర్థిక భరోసా..

అతివలకు ఆర్థిక భరోసా..