
మహనీయుల ఆశయాలు ప్రతిబింబించేలా ఉత్సవాలు
నల్లగొండ టూటౌన్ : మహనీయుల ఆశయాలు ప్రతిబింబించేలా ఈ నెల 11 నుంచి 14 వరకు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ వీసీ ఖాజాఅల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 11న ఉదయం 6 గంటలకు 5కే రన్, పానెల్ డిస్కషన్, 12న విశ్వవిద్యాలయ యువకులకు కెరీర్ అవకాశాలపై అవగాహన, 13న సింపోసియం, 14న సామాజిక పరివర్తనలో విశ్వవిద్యాలయాల పాత్రపై సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాసరచన, వకృత్త్వం, పాటలు, కవితల పోటీలను నిర్వహిస్తానమి పేర్కొన్నారు. మహనీయుల భావ స్ఫూర్తిని విద్యార్థుల్లోకి తీసుకుపోయేందుకు ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవాల చైర్మన్ కొప్పుల అంజిరెడ్డి, రిజిస్ట్రార్ అల్వాల రవి, శ్రీదేవి, వసంత, కె.ప్రేమ్‌సాగర్, సుధారాణి పాల్గొన్నారు.