
రైతుబజార్‌లో కూరగాయలు ఫుల్
భువనగిరి టౌన్: పట్టణంలోని రైతుబజార్ అన్ని రకాల కూరగాయలతో కళకళలాడుతోంది. స్థానిక రైతులు, వ్యాపారుల మధ్య తలెత్తిన వివాదం కారణంగా హైదరాబాద్ నుంచి ఆలుగడ్డ, క్యారెట్, బీట్‌రూట్, చామగడ్డ, క్యాప్సికం, చిక్కుడు కాయ దిగుమతులు 15 రోజులుగా నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై ‘రైతుబజార్‌లో కూరగాయల కొరత’ శీర్షికతో గత నెల 31న సాక్షి ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రైతుబజార్‌ను సందర్శించి సమస్య తెలుసుకున్నారు. బుధవారం సుమారు 25 రకాల కూరగాయలను అందుబాటులో ఉంచారు. ఆలుగడ్డ, క్యారెట్, బీట్‌రూట్, చామగడ్డ, క్యాప్సికం చిక్కుడు కాయలను హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్ నుంచి దిగుమతి చేయించారు. ఇకనుంచి సమస్య ఉండదని తెలిపారు.

రైతుబజార్‌లో కూరగాయలు ఫుల్