ఎయిమ్స్‌లో అందుబాటులోకి మరిన్ని వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌లో అందుబాటులోకి మరిన్ని వైద్య సేవలు

Published Thu, Apr 10 2025 1:50 AM | Last Updated on Thu, Apr 10 2025 1:50 AM

ఎయిమ్స్‌లో అందుబాటులోకి మరిన్ని వైద్య సేవలు

ఎయిమ్స్‌లో అందుబాటులోకి మరిన్ని వైద్య సేవలు

బీబీనగర్‌: బీబీనగర్‌ ఎయిమ్స్‌లో రాబోయే రోజుల్లో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా అన్నారు. బుధవారం ఎయిమ్స్‌ వైద్య కళాశాల రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జార్జ్‌ ఏ డిసౌజా వర్చువల్‌గా మాట్లాడారు. అదేవిధంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం వికాస్‌ భాటియా మాట్లాడుతూ.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాబోయే రోజుల్లో ఎయిమ్స్‌ పురోగతి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఎయిమ్స్‌ బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎంఆర్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ సంఘమిత్ర పతి, డీన్‌ రాహుల్‌ నారంగ్‌, డాక్టర్లు సంగీత సంపత్‌, అభిషేక్‌ ఆరోరా, నితిన్‌జాన్‌, వర్గీస్‌ పాల్గొన్నారు.

ఫ బీబీనగర్‌ ఎయిమ్స్‌ డైరెక్టర్‌

వికాస్‌ భాటియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement