
ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
ఫ డ్రైవర్‌కు గాయాలు
హుజూర్‌నగర్‌రూరల్: ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటన హుజూర్‌నగర్ మండలం గోపాలపురం గ్రామ ంలో గురువారం జరిగింది. వివరాలు.. పాలకవీడు మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన బోగాల సతీష్‌రెడ్డి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. గురువారం గ్రామంలోని తన మామ శంభిరెడ్డికి చెందిన ట్రాక్టర్‌లో ధాన్యం లోడుతో హుజూర్‌నగర్‌లోని రైస్ మిల్లుకు వస్తున్నాడు. కాగా హుజూర్‌నగర్ మండలం గోపాలపురంలోని ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోకి రాగానే ట్రాక్టర్ ట్రాలీ హైడ్రాలిక్‌ను చేయి తగలడంతో ట్రాలీ పైకి లేచి బోల్తా పడింది. దీంతో ధాన్యం మొత్తం మిర్యాలగూడ– హుజూర్‌నగర్ రహదారిపై పడడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ ఘటనలో డ్రైవర్ సతీష్‌రెడ్డి స్వల్పంగా గాయపడ్డాడు.
కారు బోల్తా..
నలుగురికి గాయాలు
మునగాల: విజయవాడ–హైదరాబాద్ జాతీ య రహదారిపై మునగాల మండలం మొద్దులచెరువు గ్రామ స్టేజీ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట నుంచి కోదాడ వైపు వెళ్తున్న కారు మునగాల మండలం మొద్దులచెరువు గ్రామ స్టేజీ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.
రైస్ మిల్లులో తనిఖీలు
మిర్యాలగూడ: వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ పరిధిలోని మహాతేజ రైస్ మిల్లులో గురువారం జిల్లా తూనికలు, కొలతల అధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించా రు. వేబ్రిడ్జిలో పది టన్నుల ధాన్యంకు రూ.40కిలోల తేడా వస్తుండడం గుర్తించి వేబ్రిడ్జిని సీజ్ చేసి, రూ.1.25లక్షల జరిమానా విధించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అట్రాసిటి కేసులో
జైలు శిక్ష, జరిమానా
అడ్డగూడూరు: అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో 2019లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు కాగా.. ఈ కేసులో అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కుక్కునూరు సురేందర్‌రెడ్డి అలియాస్ విష్ణువర్ధన్‌రెడ్డి, బొడ్డుగూడేనికి చెందిన తీగల నర్సిరెడ్డికి ఆరు నెలలు జైలు శిక్ష, రూ.1000 చొప్పున జరిమానా విధిస్తూ గురువారం నల్లగొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు జడ్జి తీర్పునిచ్చినట్లు అడ్డగూడూరు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా