
యాదగిరి నృసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతిష్టా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణపుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. సాయంత్రం జోడు సేవను ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
తెలుగుభాష ఘనతను చాటిన ఉషారాణి
మోత్కూరు : ఉగాదిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కవి సమ్మేళనంలో మోత్కూరుకు చెందిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం కార్యదర్శి రేగోటి ఉషారాణి ప్రతిభ కనబరిచారు. చక్కటి కవిత రచించడమే కాకుండా గానం చేసి తెలుగు భాష ఘనతను చాటారు. ఇందుకు గాను ఆమెకు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్.ఎన్.నర్సింహారెడ్డి, సైనిక దళం జనరల్ మేజర్ ఎన్.శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రశంసాపత్రం, మెమెంటో అందుకున్నారు.
ప్రచారం చేసి..
ఆలోచింపజేసి
చౌటుప్పల్ : మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలపై సూర్యాపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ వినూత్న ప్రచారం చేస్తూ ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. ఆదివారం చౌటుప్పల్‌లోని వారాంతపు సంతలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు – అనర్థాలపై ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు, పోస్టర్ల ద్వారా యువతకు సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దూమపానం, మద్యపానంతో పోలిస్తే డ్రగ్స్ వందల రెట్లు ప్రమాదకరమైనవన్నారు. డ్రగ్స్‌కు అలవాటుపడితే వారిచే మాన్పించడం చాలా కష్టమన్నారు. బానిసలుగా మారిన వ్యక్తులు నేరాలకు పాల్ప డుతారని పేర్కొన్నారు. తాము చంపుతున్నది ఎవరినో సైతం వారికి తెలియని పరిస్థితులు ఉంటాయన్నారు. డ్రగ్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రజలు చైతన్యవంతులై డ్రగ్స్, గంజాయికి యువతను దూరంగా ఉంచాలని కోరారు.
అల్లందేవిచెర్వు మాజీ సర్పంచ్‌కు పురస్కారం
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని అల్లందేవిచెర్వు మాజీ సర్పంచ్ సుర్వి యాదయ్య బిందేశ్వరి మండల అవార్డు అందుకున్నారు. యాదవ రాజ్యాధికార సాధన సమితి, బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు అవార్డు అందజేశారు. యాదయ్య సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల కోసం అనేక పోరాటాలు చేసినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యాదయ్య తెలిపారు.

యాదగిరి నృసింహుడికి నిత్యారాధనలు

యాదగిరి నృసింహుడికి నిత్యారాధనలు

యాదగిరి నృసింహుడికి నిత్యారాధనలు