
ఈదురు గాలులు, వడగండ్లు
అడ్డూగూడూరు : జిల్లాలో ఆదివారం సాయంత్రం పలు చోట్ల భారీ ఈదురుగాలు, వడగండ్ల వర్షం కురిసింది. అడ్డగూడూరు మండల కేంద్రంతో పాటు చౌల్లరామారం, కోటమర్తి, చిర్రగూడూరు, జానకిపురం గ్రామాల్లో అక్కడక్క చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి. దీంతో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. వర్షపు నీటిలోనుంచి వడ్లను వేరు చేసేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. ఈదురు గాలులకు తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. చౌల్ల రామారం గ్రామానికి చెందిన పురుగుల మల్లేష్ సాగు చేసిన మూడెకరాల వరి చేను వడగండ్ల వానకు దెబ్బతింది. ఏడు ఎకరాల్లో సాగు చేసి కుప్ప చేసి మొక్కజొన్నలు వర్షానికి తడిసి మద్దయ్యాయి. దీంతో రూ.5లక్షల వరకు నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆలేరురూరల్ : మండల పరిధిలోని శ్రీనివాసపురం, పటేల్‌గుడెం, కొలనుపాకలో చెట్లు కూలాయి. మామిడి కాయలు నేలరాలాయి.
ఆత్మకూరు(ఎం) : పల్లెపహాడ్‌లోని కొనుగోలు కేం ద్రంలో వడ్లు కొట్టుకుపోయాయి. కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మోటకొండూర్: చామాపూర్‌లోని పాశం బాల్‌రెడ్డి ఇంటి ఎదుట కరెంట్ స్తంభం కూలిపోయింది. దీంతో పాటు పలు గ్రామాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోతకు వచ్చిన వరి చేల్లో ఈదురు గాలులు, వడగండ్లకు వడ్లు నేలరాలాయి.
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
రాలిన మామిడి కాయలు,
నేలకొరిగిన వరి చేలు
కూలిన చెట్లు, స్తంభాలు,
నిలిచిన కరెంట్ సరఫరా
ఉదయం ఎండ, సాయంత్రం వాన
భువనగిరిటౌన్ : జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అ వుతుండగా, సాయంత్రం ఉన్నట్టుండి వాతా వరణం చల్లబడి వర్షం కురుస్తోంది. ఆదివా రం ఆలేరులో 10.8 మి.మీ, అడ్డగూడూరు 9 మి.మీ, మోటకొండూరు 3.3, బీబీనగర్ 1, రాజాపేట 0.8, యాదగిరిగుట్టలో 0.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఉష్ణోగ్రత సగటున 40 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైంది.

ఈదురు గాలులు, వడగండ్లు

ఈదురు గాలులు, వడగండ్లు

ఈదురు గాలులు, వడగండ్లు