
సన్నాహక సమావేశాలు.. పాదయాత్రలు
సాక్షి, యాదాద్రి : బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 27వ తేదీన వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభపై పార్టీ నేతలు దృష్టి సారించారు. అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో ఇటీవల జిల్లా నేతలతో సమావేశమై సభకు జన సమీకరణపై దిశానిర్దేశం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు వారు సభ విజయవంతంపై తలమునకలయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 10వేల మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ముగిసిన సన్నాహక సమావేశాలు
రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో ఇప్పటికే సన్నాహక సమావేశాలు ముగి శాయి. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి,నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, క్యామమల్లేష్ తదితర నాయకులు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తుంగుతుర్తి నియోజకవర్గంలో సన్నాహక సమావేశం నిర్వహించాల్సి ఉంది.
పాదయాత్రలు
సభ విజయవంతం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సోమవారం బీఆర్‌ఎస్ విద్యార్థి సంఘం, యువజన విభాగం ఆధ్వర్యంలో రాయగిరి నుంచి యాదగిరిగుట్టలోని వైకంఠద్వారం వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలుతో పాటు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీబీ మాజీ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా వలిగొండ మండలం వేములకొండలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయనుంచి యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాదాల వరకు బీఆర్‌ఎస్‌వీ, బీఆర్‌ఎస్‌వై జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నారు. పాదయాత్రను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అదే విధంగా పోటాపోటీగా వాల్‌రైటింగ్ చేస్తున్నారు. వరంగల్‌వైపు జాతీయ రహదారి, ప్రధాన రోడ్ల వెంట చలో వరంగల్, రజతోత్సవ సభను జయప్రదం చేయాలంటూ వాల్‌రైటింగ్ చేయడం ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది.
రాయగిరి నుంచి గుట్టకు పాదయాత్ర
భువనగిరి, యాదగిరిగుట్ట : బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ భువనగిరి మండలం రాయగిరి నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వైకుంఠద్వారం వరకు బీఆర్‌ఎస్ విద్యార్ధి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు యాదగిరిగుట్టలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, షిఫ్ అండ్ గోట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి మాట్లాడారు. కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అంతకుముందు రాయగిరిలో పాద యాత్రను పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రారంభించారు. పాదయాత్రలో బీఆర్‌ఎస్ గుట్ట మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, నాయకులు మిట్ట వెంకటయ్య, కసావు శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు ఒగ్గు శివకుమార్, ప్రవీణ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, ఆలేరు నియోజకవర్గ అధ్యక్షుడు ర్యాకల రమేష్, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ మిట్ట అరుణ్‌గౌడ్, ఆయా మండలాల యూత్, విద్యార్థి విభాగాల అధ్యక్షులు ఎండీ అజ్జు, పల్లె సంతోష్ గౌడ్, భగత్‌సింగ్, రాసాల ఐలేష్ యాదవ్, బాల్‌సింగ్, భానుచందర్, బండ జహంగీర్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ
జన సమీకరణకు నేతల సన్నాహాలు
ఒక్కో నియోజకవర్గం నుంచి
10వేల మంది తరలించాలని లక్ష్యం