
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి
నల్లగొండ టూటౌన్: విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి అన్నారు. బుధవారం ఎంజీయూలో ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్‌కు చెందిన ఫ్రాంక్లిన్ టెక్ సిస్టమ్స్ కంపెనీ సహకారంతో ఐటీ, నాన్‌ఐటీ, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ సెక్టార్‌లో ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో 250మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో డాక్టర్ జయంతి, సుధారాణి, నాగరాజు, సత్యనారాయణరెడ్డి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.