
భూదాన వజ్రోత్సవాలను జయప్రదం చేయాలి
భూదాన్‌పోచంపల్లి: భూదానోద్యమానికి అంకురార్పణ జరిగి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా పోచంపల్లిలో ఈ నెల 18న నిర్వహించే భూదాన వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని గాంఽధీగ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్‌రెడ్డి కోరారు. బుధవారం పోచంపల్లిలోని వినోబాభావే మందిరాన్ని ఆయన సందర్శించి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18న పోచంపల్లిలో భూదాన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భూదాన యజ్ఞబోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డితో పాటు స్థానిక ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్, భూ భారతిసభ్యులు సునీల్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, గాంధీ జ్ఞాన్‌ప్రతిష్టాన్ సెక్రటరీ సుబ్రమణ్యం తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వినోబాభావే సేవాసమితి నాయకులు ఏలే భిక్షపతి, కొయ్యడ నర్సింహ, వేశాల మురళి, భాస్కర్ పాల్గొన్నారు.
ఫ గాంఽధీగ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్‌రెడ్డి