
బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం.. భార్య మృతి
చౌటుప్పల్ రూరల్: బంధువుల అంత్యక్రియలకు బైక్‌పై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి డీసీఎం ఢీకొనడంతో తీవ్ర గాయాలతో భార్య మృతి చెందింది. భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం రెడ్డిబాయి గ్రామ స్టేజీ వద్ద గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం ఏపూర్ గ్రామానికి చెందిన కొండె జంగయ్య తన భార్య హైమావతి(39)తో కలిసి చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో తమ బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బైక్‌పై వస్తున్నారు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం రెడ్డిబాయి గ్రామ స్టేజీ వద్దకు రాగానే హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైమావతి తీవ్రంగా గాయపడింది. జంగయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. హైమావతిని చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జంగయ్య రైల్వే డిపార్ట్‌మెంట్‌లో గ్యాంగ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. వీరికి బీటెక్ చదివే కుమారుడు, ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తె ఉన్నారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
ఫ భర్తకు గాయాలు