డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

Published Fri, Apr 25 2025 1:04 AM | Last Updated on Fri, Apr 25 2025 1:04 AM

డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

నల్లగొండ: నల్లగొండ పట్టణంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్‌ చేసి, వారి నుంచి 2400 స్పాస్మో ట్యాబ్లెట్లు, ఒక బైక్‌, రూ.22,000 నగదు, రెండు సెల్‌ఫోన్లు, మెడికల్‌ షాప్‌ లైసెన్స్‌ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు. ఈ కేసు వివరాలను ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం నల్లగొండ వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ రాజశేఖర్‌రెడ్డితో కలిసి డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 11గంటల సమయంలో నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని మునుగోడు రోడ్డులో వన్‌ టౌన్‌ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ సందీప్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని అక్కచెల్మ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఖాజా వసీముద్దీన్‌ అలియాస్‌ వసీం అక్రం బైక్‌పై బ్యాగుతో అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాగును తనిఖీ చేయగా అందులో 288 మత్తు కల్గించే స్పాస్మో ట్యాబ్లెట్‌ షీట్లు లభించాయి. అతడి నుంచి ట్యాబ్లెట్ల షీట్లతో పాటు బైక్‌, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వసీముద్దీన్‌తో పాటు అక్కచెల్మ ప్రాంతానికే చెందిన అతడి స్నేహితులు ఖాజా షోయబ్‌, షేక్‌ అమేర్‌ కొంతకాలంగా స్పాస్మో ట్యాబ్లెట్స్‌ సేవిస్తూ వాటికి బానిసయ్యారని డీఎస్పీ పేర్కొన్నారు. ఈజీగా డబ్బులు సంపాదించాలని వీరు ముగ్గురు స్థానికంగా మెడికల్‌ షాపుల్లో ఈ స్పాస్మో ట్యాబ్లెట్లు అమ్మట్లేదని తెలుసుకుని, గత ఆరు నెలల నుంచి ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఛాయా మెడికల్‌ షాప్‌ నిర్వాహకుడు కొప్పురవారి యశ్వంత్‌ మణిదీప్‌ శ్రీనివాసరావు దగ్గరకు బైక్‌పై వెళ్లి స్పాస్మో ట్యాబ్లెట్లు కొనుగోలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఒక్కో షీట్‌ను రూ.100కు కొని వారి అవసరం మేరకు వినియోగించగా.. మిగిలిన ట్యాబ్లెట్లను ఒక్కో షీట్‌ రూ.180కు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పట్టుబడిన వసీముద్దీన్‌ను తీసుకొని పిడుగురాళ్లకు వెళ్లి ఛాయా మెడికల్‌ షాప్‌ నిర్వాహకుడు మణిదీప్‌ శ్రీనివాసరావును పట్టుకున్నట్లు తెలిపారు. అతడి వద్ద నుంచి 15 షీట్ల స్పాస్మో ట్యాబ్లెట్లు, సెల్‌ఫోన్‌, మెడికల్‌ షాపు లైసెన్స్‌ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. వసీముద్దీన్‌, మణిదీప్‌ శ్రీనివాసరావును రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఖాజా షోయబ్‌, షేక్‌ అమేర్‌ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న వన్‌ టౌన్‌ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు శంకర్‌, సందీప్‌రెడ్డి, కానిస్టేబుళ్లు రబ్బాని వెంకటనారాయణ, కిరణ్‌, షకీల్‌, శ్రీకాంత్‌, సైదులును ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అభినందించారు.

డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా

ఎలాంటి టాబ్లెట్టు అమ్మొద్దు..

మెడికల్‌ షాపుల నిర్వాహకులు డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా ఎలాంటి టాబ్లెట్లు అమ్మొద్దని డీఎస్పీ శివరాంరెడ్డి సూచించారు. ఒకవేళ అధిక డబ్బులకు ఆశపడి అమ్మితే షాప్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా స్పాస్మా టాబ్లెట్ల కోసం మెడికల్‌ షాపుల వద్దకు వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

ఫ 2400 స్పాస్మో ట్యాబ్లెట్లు, బైక్‌, రూ.22,000 నగదు, రెండు

సెల్‌ఫోన్లు స్వాధీనం

ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ

డీఎస్పీ శివరాంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement