
యాదగిరిగుట్ట ఆలయం అద్భుతం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం గొప్ప విషయమని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన తన స్నేహితులతో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం ఫలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషానిచ్చిందన్నారు. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రతిఒక్కరికి అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.