నేడు పులివెందులకు సీఎం జగన్‌ | - | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ పర్యటన: పులివెందుల సిగలో మరో కలికితురాయి!

Published Mon, Mar 11 2024 5:55 AM | Last Updated on Mon, Mar 11 2024 8:05 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: ‘పేదల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాన్న రెండు అడుగులు ముందుకేస్తే, ఆయన కొడుకుగా నాలుగు అడుగులు ముందుకేస్తా... మీ బిడ్డగా నాక్కావాల్సింది మీ ప్రేమాభిమానాలు..ప్రతి ఇంట్లో ఉన్నట్లుగా నాన్న ఫొటో పక్కన నా ఫొటో కూడా చేరాలి’ విపక్షనేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. గత నాలుగున్నరేళ్ల పాలనతో అచ్చం అలాగే పేదలకు పెన్నిధిగా మారారు సీఎం జగన్‌. ఒకవైపు రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తూనే.. తాను పుట్టిన గడ్డ వైభోవపేతానికి విశేష కృషీ చేస్తున్నారు.

పులివెందుల సిగలో మరో కలికితురాయి వచ్చి చేరింది. రూ.861.84 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం జాతికి అంకితం చేయనున్నారు సీఎం జగన్‌. ఓవైపు జిల్లా కేంద్రమైన కడపను మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దారు. అత్యాధునిక వైద్య సేవలకు నిలయంగా నెలకొల్పారు. సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు పుట్టిన గడ్డ పులివెందుల రుణం తీర్చుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ఏపీఎంఎస్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) ద్వారా రూ.500కోట్లతో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను నిర్మించారు.

పార్లమెంట్‌పరిధిలో ఒక మెడికల్‌ కళాశాల నిర్మించాలని సంకల్పించిన సీఎం, డిసెంబర్‌ 26, 2019న పులివెందులలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.తర్వాత రెండేళ్లు కోవిడ్‌ వైరస్‌ కారణంగా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 627 పడకల వసతి గల ఆస్పత్రి, ఏడాదికి 150 మెడికల్‌ సీట్లు, 60 నర్సింగ్‌ సీట్లల్లో విద్యార్థులు విద్యను అభ్యసించేలా నెలకొల్పారు. జీ ఫ్లస్‌ 3గా నిర్మించిన ఈ భవనాలు ఒక్కొక్క ఫ్లోర్‌ 37,300 చదరపు అడుగులతో చేపట్టారు. రాబోయే విద్యాసంవత్సరానికి మెడికల్‌ కళాశాల అందుబాటులోకి వచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారు.

ఏర్పాట్ల పరిశీలన
పులివెందుల రూరల్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11వ తేదీ పులివెందుల ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన పర్యటించే ప్రాంతాలను జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌కుమార్‌,పరిశీలించారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించే వైఎస్సార్‌ మెడికల్‌ కళాశాల, కళాశాలలోని భవనాలను పరిశీలించారు. అనంతరం బనానా ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌హౌస్‌, మినీ సెక్రటేరియట్‌ భవనాన్ని, వైఎస్సార్‌ సర్కిల్‌ బోలేవార్డు షాపింగ్‌ కాంప్లెక్స్‌ గాంధీ సర్కిల్‌, ఉలిమెల్ల లే క్‌ ఫ్రంట్‌, అక్కడే నూతనంగా నిర్మించిన ఆదిత్యా బిర్లా గార్మెంట్‌ లిమిటెడ్‌ ఇండస్ట్రీని, సంయుగ్లాస్‌ ఇండస్ట్రీని వారు పరిశీలించారు.

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు: ఏస్పీ
పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల11 జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సిద్దార్ధ్‌ కౌశల్‌ పోలీసులకు సూచించారు. ఆదివారం ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ కడప ఎయిర్‌ పోర్టు, పులివెందుల హెలీప్యాడ్‌, ప్రారంభోత్సవాలు జరిగే ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేయాలన్నారు.అదనపు ఎస్పీ సుధాకర్‌,స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌బ్యూరో అదనపు ఎస్పీ వెంకటరాముడు, కర్నూల్‌ అదనపు ఎస్పీ నాగరాజు పాల్గొన్నారు.

అందుబాటులోకి ఆదిత్య బిర్లా గార్మెంట్స్‌
పులివెందుల కేంద్రంగా నూతనంగా నిర్మించిన ఆదిత్య బిర్లా గార్మెంట్స్‌ యూనిట్‌ను సైతం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. 16 ఎకరాల విస్తీర్ణంలో రూ.175 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ సంస్థ నిర్మాణానికి 2021 డిసెంబర్‌ 24న శంకుస్థాపన చేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రయోజనాల (పీఎల్‌ఐ) పథకంలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్‌ టెక్స్‌టైల్స్‌, బ్రాండెడ్‌ గార్మెంట్స్‌ తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. ఏటా 24లక్షల గార్మెంట్స్‌ తయారీ సామర్థంతో నెలకొల్పిన ఈ యూనిట్‌లో 2100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి కల్పించేలా తీర్చిదిద్దారు. తొలిదశగా 500మందికి ఉద్యోగాలు కల్పించారు.

వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్క్‌
ఇడుపులపాయ కేంద్రంగా రూ.39.13 కోట్లతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్క్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందులో 48 అడుగుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహంతోపాటు, అడియో విజువల్‌, ఫొటో గ్యాలరీ, పెవిలియన్‌ బ్లాక్స్‌తోపాటు, రెస్టారెంట్‌, చిల్డ్రన్స్‌ పార్క్‌, గార్డెన్స్‌ నిర్మించారు. పులివెందుల సమీపంలో రూ.66 కోట్లతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉలిమెల్ల లేక్‌ను ప్రారంభించనున్నారు. మ్యూజికల్‌ లేజర్‌ ఫౌంటేన్‌, కిడ్స్‌ప్లే ఏరియా తదితర సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. మరో రూ.20 కోట్లతో నిర్మించిన బ నానా ప్యాక్‌ హౌస్‌ను ప్రారంభించనున్నారు. మొత్తంగా పులివెందుల నియోజకవర్గంలో రూ.861.84కోట్ల అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement