పోలీస్ స్టేషన్‌కు బారికేడ్ల వితరణ
పులివెందుల రూరల్ : పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు గురువారం భారతి సిమెంటు కంపెనీకి చెందిన 50 బారికేడ్లను వితరణగా అందించారు. ఈ సందర్భంగా భారతి సిమెంటు కంపెనీ మార్కెటింగ్ శాఖ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, మార్కెటింగ్ అధికారి కొండారెడ్డి, మేనేజర్ ప్రతాప్‌రెడ్డిలు ట్రాఫిక్ సీఐ హాజివలిని కలిసి బారికేడ్లను ప్రారంభించారు. అలాగే పాత బస్టాండులో వెలసిన శ్రీపద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయానికి కూడా 5 బారికేడ్లను భారతి సిమెంటు ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా భారతి సిమెంటు తరపున ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, భారతి సిమెంటు కంపెనీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment