అధికారులూ.. మీకిది తగునా?
టాస్క్ ఫోర్స్: ప్రజా ప్రతినిధులతో అధికారులు కల వడం పాలనలో ఒక భాగం..కానీ నేడు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులతో అంట కాగుతూ ...వారి సేవల్లో కొందరు అధికారులు విధులకు డుమ్మా కొట్టి తరిస్తుండటంపై సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు, సిబ్బంది వారి విధులను ప్రక్కన పెట్టి రాజకీయ నాయకుల దృష్టిలో పడేందుకు అనేక రకాల పాట్లు పడుతున్నారు. ఈ కోవలోనే అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రి మేనల్లుడు తిరుమలకు వెళుతుండగా ఆయన ఆశీస్సుల కోసం రాయ చోటికి చెందిన కొంతమంది మున్సిపల్, పోలీస్, ఇతర శాఖలకు చెందిన అధికారులు పూల బొకేలు, భారీ దండలతో స్వాగతాలు పలకడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉన్నతాధికారుల సైతం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నట్లు తెలియవచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment